జనంన్యూస్. 14. నిజామాబాదు. నిజామాబాద్.
ఎలక్ట్రిషన్ రంగానికి వైశాక్షి హనుమంతరావు లేని లోటు తీరనిదని రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి అన్నారు. గురువారం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వైర్ మెన్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వైశాక్షి హనుమంతరావు సంతాప సభ గురువారం నగరంలోని ఎల్లమ్మ గుట్ట సత్య ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేశారు. వైశాక్షి హనుమంతరావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొండల్ రెడ్డి మాట్లాడుతూ..హనుమంతరావు గత 50 సంవత్సరాల నుండి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గురించి అనేక సేవలు చేశారన్నారు. వారి కుమారుడు వైశాక్షి సంతోష్ మాట్లాడుతూ.. యాభై ఏళ్లు నిరంతరం ఎలక్ట్రిషన్ సమస్యలపై పోరాడారని, సమస్యల పరిష్కారం కొరకు పని చేశారన్నారు. కుటుంబం కంటే కూడా ఎలక్ట్రిషన్ సంఘం కోసమే ఎక్కువగా తన సమయాన్ని వెచ్చించారని అన్నారు. ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఎలక్ట్రిషన్ల కొరకు ఇన్సూరెన్స్ కావాలని గత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కు
వివరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలక్ట్రిషన్ల కొరకు లేబర్ కార్డు ని చేయించారన్నారు. భవన నిర్మాణ కార్మికుల అందరికీ కార్డును తయారు చేయించిన గొప్ప వ్యక్తి అన్నారు. సంవత్సరానికి 12 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల 60 రూపాయలు కట్టించుకుని రెండు లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరఫున ఇప్పించడం జరిగిందన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఐదు లక్షలు గా ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగిందని, అప్పటి నిజామాబాద్ ఎమ్మెల్యే సతీష్ పవర్ ఉన్నపుడు 100 ప్లాట్లు ఇప్పించడం జరిగిందన్నారు. ప్రతి ఎలక్ట్రిషన్ కు వైర్ మెన్ పర్మిట్ ఉండాలని ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయించేవారన్నారు. హైదరాబాద్లో ఉన్న లైసెన్సింగ్ బోర్డుని కూడా నిజామాబాద్ తెప్పించడం జరిగిందన్నారు. ఎలక్ట్రిషన్ల కొరకు హర్నిశలు కష్టపడే వైశాక్షిహనుమంతరావు అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం ఎలక్ట్రిషన్ లకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపర్ కంపెనీ సీఈఓ కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్ సలీం, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, రఫీ, మహిమ, మైమడ్ లింబాద్రి రాజు అతటారఖాన్ తదితరులు పాల్గొన్నారు.