ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ
జనం న్యూస్,ఆగస్టు14,జూలూరుపాడు:
మండలంలోని సెయింట్ ఆంటోనీ పాఠశాల నందు ఈనెల 16వతేదీన శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ముందస్తుగా వెన్నె కృష్ణుడు, బాల కృష్ణుడు పండుగ నిర్వహించారు.తెలుగు సంస్కృతి, హిందూ సాంప్రదాయంతో ఆధ్యాత్మికంగా ఆనందంగా నిర్వహించుకొనే ఈ పండుగ సెయింట్ ఆంటోనీ పాఠశాల నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. చిన్నారులంతా శ్రీకృష్ణ, గోపికమ్మ వేషధారణలతో పాఠశాలలో పందడి చేశారు. సెయింట్ ఆంటోనీ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్తి మరియు కరస్పాండెంట్ సౌమ్య లు మాట్లాడుతూ విద్యార్థులకు శ్రీకృష్ణ గురించి,వివిధ దైవతామూర్తుల గురించి మన చరిత్రను తెలియజేయటం వారికి అవగాహన కల్పించడం ద్వారా చదువుతోపాటు చరిత్ర తెలుసుకోగలుగుతారని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్కూల్ టీచర్స్ మరియు పిల్లల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.