జనంన్యూస్. 15. నిజామాబాదు.
నిజామాబాదు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నాం అన్నారు. గుండె నిండా దేశభక్తి కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యువత దేశానికి కావాలన్నారు,విద్యార్థి దశనుండే పిల్లల్లో దేశభక్తి, మహనీయుల స్ఫూర్తిని నింపాలన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చాక భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తు కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయి ప్రజలకు చేరవేస్తూ కూడు,గూడు, గుడ్డ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. భారత దేశాన్ని మూడోవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపొందించడంతో పాటు రక్షణ వ్యవస్థను కూడా పటిష్టం చేసిన ఘనత కేంద్రప్రభుత్వానిది అన్నారు.370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ను పర్యాటక రంగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తు ఒకే దేశంలో రెండు రాజ్యాంగలు చెల్లవని ఒక దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలని అమలులో తెచ్చిన ఘనత మోదీ గారిది అన్నారు.పహాల్ గామ్ ఘటనతో ప్రతి భారతీయునిలో మరిగిన రక్తనికి ఆపరేషన్ సిందూర్ ఘన విజయం గర్వకారణం అన్నారు.ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అంతం చేయడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు, ఉగ్రవాదాదేశాలు భారత్ లో అడుగుపెట్టడానికి ఆపరేషన్ సిందూర్ ఒక హెచ్చరికగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.