జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తాండ బంజారాలు గురువారం నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో బంజారా సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బంజారా లు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పండుగలో తీజ్ పండుగ ఒకటని తీజ్ పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎస్ఐ అన్నారు. పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో సంతోషంగా నిమజ్జనం చేసుకోవాలని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టాపూర్ బంజార సంఘ సభ్యులు, ఏ ఎస్ ఐ లక్ష్మణ్ నాయక్, కానిస్టేబుల్ సుమన్ నాయక్, భిక్షు నాయక్, తదితరులు, పాల్గొన్నారు.