జరం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, పాయకరావుపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఐఏఎస్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్, విధి నిర్వహణలో చూపిన విశిష్ట సేవలు, కృషి, నిబద్ధతకు గుర్తింపుగా ఈ ప్రశంసలను అందజేశారు. ఈయన కాట్రేనికోన మండలంలోని నడవపల్లి గ్రామానికి చెందిన గిడ్డి శ్రీనివాస్ , ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు