జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా సర్పంచ్ జంబు సూర్య నారాయణ మాట్లాడుతూ స్వతంత్ర సమరంలోఎందరో మహానుభావులు అమర వీరుల త్యాగ ఫలీతమే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వతంత్ర దినోత్సవం అన్నారు భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్య క్రమంలో సచివాలయ గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది పారిశుద్ధ కార్మి కులు.వార్డు సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ ప్రసాద్ గంగాధర్ సుబ్బ నరసయ్య మారేశివకుమార్ తెలుగు దేశం కూటమి నాయకులు ఆదినారాయణ కానకుర్తి వెంకటయ్య,మట్టి బాబు, తుమ్మాది శివకుమార్, మౌలా మెహర్ ఖాన్ పొమ్మల శివ నరసింహలు సురేష్, శివశంకర్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.