జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
బొండపల్లి మండలం, కెరటాం గ్రామం లో శనివారం రాత్రి జరిగిన నెడుగంటి అప్పలక్రిష్ణ హత్య కేసును బొండపల్లి పోలీసులు చేదించారు. ఈ నేపధ్యం లో హత్యకు గురైన అప్పలకృష్ణ మేనల్లుడు నారపాటి సాయి,తో పాటు భార్య రాజు, కుమారుడు ( జువైనిల్) హత్య చేసినట్లు గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.వి రవణ తెలిపారు. గురువారం సాయంత్రం బొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ మండలం లోని బిల్లలవలస సమీపం లో అప్పలక్రుష్ణ హత్య చేసిన నారపాటి సాయి ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారం మేరకు బొండపల్లి యస్. ఐ.యు మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసారని తెలిపారు.నిందితుడు నారపాటి సాయి ను అప్పలకృష్ణ హత్య విషయమై విచారణ చేయగా హత్య తో అప్పల కృష్ణ భార్య రాజు, కుమారుడుకు సంబంద౦ ఉన్నట్లు విచారణ లో తేలిందని అన్నారు. ఈ మేరకు మేనల్లుడు సాయి తో పటు భార్య రాజు, కుమారుడు లను అదుపులో తీసుకోవడం జరిగిందని అన్నారు. కాగా శనివారం రాత్రి నారపాటి సాయి తన మేనమామ నడిగంటి అప్పల కృష్ణ ను కెరటాం గ్రామ చివరకు తీసుకొని వెళ్లి మధ్య౦ సేవించారని ఈ క్రమ౦లో అప్పల కృష్ణ గొంతునునొక్కి సాయి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. అయితే చనిపోయిన అప్పల కృష్ణ ను ఇంటికి తీసుకొచ్చేందుకు అప్పలకృష్ణ కుమారుడు, భార్య సహరించారని సహజ మరణం గా చిత్రీకరించి వారి మత సాంప్రదాయం ప్రకారం ఖననం చేసారని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.వి రవణ గుర్తు చేశారు. తొలిత పోలీసులు అప్పల కృష్ణ ది అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసారని పోలీసుల దర్యాప్తు లో హత్యగా నిర్ధారణ అయ్యిందని ఆయన అన్నారు.మృతుడు భార్య రాజుకు మేనల్లుడు నారపాటి సాయి కి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ఆయన స్పష్టం చేశారు. హత్య కేసును చేదించిన బొండపల్లి యస్. ఐ.యు మహేష్, పోల్లీసు సిబ్బందిని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.వి రవణ అభినందించారు.ఈ సమావేశం లో బొండపల్లి యస్. ఐ.యు మహేష్, ట్రైనీ యస్.ఐ సాయి కుమార్ పాల్గొన్నారు ఫోటో నెం : 14 మాట్లాడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.వి రవణ