విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఆగస్టు 15న ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎన్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, పాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయులు జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జాతీయ జెండాను ఎగుర వేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - స్వాతంత్ర్యంను సాధించేందుకు చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలు, కృషి ఫలితంగా లభించిందన్న విషయాన్ని మరువద్దన్నారు.స్వాతంత్ర్యం రాక పూర్వం మన దేశం విదేశీయుల కబంధ హస్తాల్లో ఉండేదని, వారి పాలనలో మనకు ఎటువంటి స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత భారతీయులకు స్వేచ్ఛ లభించిందని, దీని ఫలితంగా భారత రాజ్యాంగం ఏర్పడి, దేశ పౌరులుగా కొన్ని హక్కులు, బాధ్యలు వచ్చాయన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన బాధ్యతలను దేశం కోసం, సమాజ శ్రేయస్సు, కుటుంబం కోసం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా యన్నారు. విద్యార్ధులు తమ పెద్ద వాళ్ళు చెప్పిన మంచి విషయాలు వినాలని, వారి పట్ల వినయంగా ఉంటూ, వారి ఆశలను, ఆశయాలను నెరవేర్చాల్సి ఉందన్నారు. మంచి స్కూల్లో చదివిస్తున్న మీ తల్లిదండ్రుల పట్ల, టీచర్లు పట్ల వినయంగా ఉండాలని, మంచి వ్యక్తిత్వంను అలవర్చుకొని, ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. పిల్లల బాధ్యతాయుతంగా చదువుకొని, ఉన్నత స్థానాలకు ఎదగాలని, వారి భవిష్యత్తుకు ఉపాధ్యాయులు మంచి బాటలు వేయాలన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావం, సమైఖ్యత పెంపొందించాలని, ఈ జాతీయ సమత్ర, సౌభాతృత్వం పట్ల విశ్వాసాన్ని కల్పించి, వారిని ఉత్తములుగా తీర్చిదిద్ది, భవిష్యత్తు భారతావనికి క్రమశిక్షణ కలిగిన పౌరులను అందించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు జాతీయ నాయకుల వేష ధారణ చేసి, ఆహ్వానితులను ఆనందపర్చారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికేట్లును ప్రదానం చేసారు. అనంతరం, విద్యార్థులకు జిల్లా ఎస్పీ మిఠాయిలను, చాక్లెట్స్‌ను, బిస్కెట్లును పంచి పెట్టారు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను, విద్యార్ధులను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, విజయనగరం డిఎస్పీ
ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఆర్ఐలు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ సంధ్య, ఆర్ఎస్ఐ వరప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.