జనం న్యూస్,ఆగస్టు15,
అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎంపీడీవో,ఎమ్మార్వో కార్యాలయం మరియు వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయం ఎలమంచిలి ఎమ్మార్వో కార్యాలయం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.ఏ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎందరో మహనీయులు,దేశభక్తులు వీరోచిత పోరాటాలు చేశారని,ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితమే ఈ రోజు మన స్వేచ్ఛకు కారణమని, స్వాతంత్రోద్యమంలో జిల్లా నుండి గుళ్ళపల్లి నారాయణ మూర్తి,శిష్టా లింగమాంబ,నారాయణ శర్మలాంటి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారని,భరతమాతను దాస్యశృంఖలాల నుండి విముక్తి చేయుటకు బ్రిటిషు వారిపై యుద్ధం చేసి,స్వాతంత్ర్యకాంక్షను రగిల్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు,అధికారులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.