భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 15 ( జనం న్యూస్ ప్రతినిధి)
కొత్తగూడెం కూలిలైన్లో కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు) నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఆయన ప్రతిమకు అభివందనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎంయు జిల్లా అధ్యక్షుడు కురుమల శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల ఫాల్గుణ, జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి బాలకృష్ణ, రాష్ట్ర నాయకుడు కొప్పుల రమేష్, జిల్లా నాయకుడు జక్కుల సంపత్, కుటుంబ సభ్యులు జక్కుల విజయ్ కుమార్, జక్కుల రాజు, కూకట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడు కురుమల శంకర్ మాట్లాడుతూ – “కూకట్ల ఐలయ్య సామాజిక సేవలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. ఆయన త్యాగాలు, సేవలు యువతకు ప్రేరణగా నిలుస్తాయి” అని ఆయన అన్నారు