జనం న్యూస్ ఆగస్టు 15:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని బట్ట పూర్ గ్రామంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న మూడ్ దయానంద్ ను స్థానిక అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు గ్రామస్తులు 79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం శాలువాతో సన్మానించి,మేమంటును అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. దయానంద్ గ్రామంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యలు తీరుస్తూ, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని గ్రామం తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల సమస్యలు తీరుస్తూ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అన్నారు. దయానంద్ చేస్తున్న సేవ కార్యక్రమల ను గుర్తించి సన్మానిస్తున్నట్లు, సేవా కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి కోసం పాటుపడుతున్న యువజన సంఘాల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు జితేందర్,సభ్యులు గద్దల గణేష్, నరేందర్, మహేందర్, చింటూ, చిన్ని, ప్రవీణ్, సాయి, మధు,గణేష్, యువకులు కటికే శ్రీను, గౌండ్ల శ్రీనివాస్, స్వామి , అక్షయ్, చిరంజీవి, రాజు,విడిసి అధ్యక్షుడు భత్తుల సంజీవ్, విడిసి సభ్యులు పెద్ద సాగర్ ,హుస్సేన్, రైతు రమేష్,