జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మండలం పరిధిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుత్తిన దీవి సాయిరాం విద్యానికేతన్ లో కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు బృందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భముగా స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతు బ్రిటిష్ వారు మన దేశం నుండి ఎంతో సంపద ను దొచుకుని వెళ్లినప్పటికీ మన నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో మనదేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.ఎంత అభివృద్ధి జరిగితే అంత అవినీతి కూడా కనిపిస్తూనే ఉందని,దేశం మారాలి అంటే మనలో మార్పు రావాలని (ప్రతీ ఒక్కరిలోనూ మన పని త్వరగా అవ్వలని ఉంటుందన్నారు. అపనులు పూర్తి చేసుకునేందుకు లంచం ఇచ్చి వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. మనం ఎగరేసే జాతీయ జెండా ఎగిరేది గాలితో కాదు మనదేశం కోసం (ప్రాణత్యాగాలు చేసిన ఎంతో మంది అమరవీరుల శ్వాసలో అని మనం గుర్తు పెట్టుకోవాలని. మనం అనే ఒక్కో మెతుకు ఎంతో మంది త్యాగ ఫలితం అని గుర్తు చేసుకోవాలన్నారు.ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమిడి నాగేంద్ర వర్మ ,గెల్లా భూలక్ష్మి దేవికే.నాగజ్యోతి ,డి.దుర్గా, పి.లతా మంగేష్కర్, ఎన్. దేవకి, ఎన్.విజయదుర్గ ,కే. నాగ దివ్య ,ఏ.ప్రత్యూష , ఏ .శిరీష, పూర్ణిమ, పూర్ణదుర్గ, డి .వీరలక్ష్మి, ఎం. అమ్మాజీ, ఎం. మాలతి, సత్య, తదితరులు పాల్గొన్నారు.