జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 16 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
దివంగత నేత భారతీయజన సంఘ వ్యవస్థాపకలలో ఒకరైన బిజెపి మొట్టమొదటి జాతీయ అధ్యక్షులు భారతరత్న మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నిలువెత్తు విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నాయకులు పోలూరి శామ్మోహన్ రావు బిజెపి పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు బిజెపి ఉపాధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు యువ నాయకులు కందిమల్ల వెంకటేశ్వర్లు ఆఫీసు సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ బీసీ నాయకులు ఊటీ కొండ నాగేశ్వరరావు ఓ బి సి సెక్రటరీ జోలాపురం వెంకటరాయుడు మరియు స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు నరేంద్రమోడీ అభిమానులు వాజ్పేయి అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి మూడుసార్లు భారతదేశ ప్రధానిగా దేశానికి దేశ అభివృద్ధికి ప్రధాతగా నిలిచారని భారత అను శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని అదేవిధంగా మౌలిక రంగం రోడ్లు ఇన్ఫాస్ట్రక్చర్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు అందే విధంగా అంత్యోదయ మూల సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారని అలాంటి మహానుభావుల చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు