జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
79 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తహశీల్దార్ ఆఫీస్ నందు తహసీల్దార్ జి. అమరేస్వరీ జండా వందనo చేపట్టటం జరిగినది తహసిల్దార్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్య్ర దినోత్సవం అని భారత జాతీయ విముక్షి పొందిన చారిత్రాత్మక రోజు అని అన్నారు.దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించు కోవడం మన కర్తవ్యం అని కొనియాడారు. ఈ కార్య క్రమానికి ఉప తహశీల్దార్ పి.మోహన్ కృష్ణ మరియు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.సుశీల్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సర్వేయర్లు గ్రామ రెవెన్యూ సహాయకులు మరియు పోలీసులు పాల్గొనటం జరిగినది.