జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ వా వి రాల మహేష్ కుమార్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందజేశారు. తన విధుల్లో నిబద్ధత, కృషి, ప్రతిభ ప్రదర్శనకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ఎస్సై అవినాష్ సహచరులు, పోలీసు శాఖ అధికారులు, స్నేహితులు, మండల గ్రామ ప్రజలు అభినందించారు.