జనం న్యూస్ ఆగష్టు 16 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్ పూర్ ఎస్ఐ రాజు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు నుండి శనివారం ఉదయం 16 గేట్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు అని తెలిపారు. మండల పరిధిలోనీ రంగాసాగర్, మంగెల, కమ్మునూర్,చిత్రవేణి,గూడెం, రేకులపల్లి, చిన్నకొల్వై, ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే విధంగా శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే రాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వాగులు,వంకలు, నీటి ప్రవాహాన్ని చూసుకొని వెళ్ళాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.