జనం న్యూస్ :16 ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై.రమేష్ ;
నలంద విద్యాలయలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే వేడుకలతో పాఠశాల ఆవరణమంతా ఉత్సాహభరితంగా మారింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం హరినాథ్ డైరెక్టర్ నిత్యసి ఉపాధ్యాయులు గౌసే, వేగం, నాగరాణి, ఆమ్రిన్, అనిత, శిరీష, అంజలి, అమృతం పాల్గొని చిన్నారులను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థినులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.