జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )
భవన నిర్మాణ కార్మిక సంఘం మునగాల మండల 5వ మహాసభలు ఈనెల 18న సోమవారం జరుగు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం కార్మికులకు పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రంలోని సుందరయ్య భవనంలో షేక్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం పాల్గొని మాట్లాడారు.. భవన నిర్మాణ కార్మిక సంఘం గత మండల మహాసభ నుంచి నేడు జరగబోతున్న మండల మహాసభ వరకు గత కార్యక్రమాల సమీక్ష పై చర్చించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను ఈ నెల 18న సోమవారం జరుగు 5వ మండల మహాసభలో రూపొందించుకొని కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కొరకు నిరంతరం పని చేస్తామని తెలియజేస్తూ కార్మికులందరూ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరినారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ దస్తగిరి, మండల కార్యదర్శి నాగేంద్రబాబు,మండల సహాయ కార్యదర్శి అల్లి నాగరాజు,సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కోలా ఆంజనేయులు,ఉపాధ్యక్షులు షేక్ సైదా,షేక్ జాన్,పాషా షేక్ కాజా,జి కనకయ్య,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.