జనం న్యూస్ ఆగస్టు 16:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో రెండు రోజుల నుండి ఎడతెరిపి వర్షాల కారణం గా రోడ్డ పైన గుంతలు ఏర్పడి వాగు లాగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ర్పడింది. పాదాచారులకు, , ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లు భవనాలశాఖ అధికారులకు, మండల అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన ఫలితం లేదు అని గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామాలలో సర్పంచ్లు లేక గ్రామాభివృద్ధి కుటుంబడింది అనేది సందేహం లేకపోలేదు అని చెప్పవచ్చు.ఎప్పటికైన అధికారులు వచ్చి రోడ్డు ను బాగుచేయ్యాలనిప్రజలు కోరారు.