జనం న్యూస్,ఆగస్టు16,అచ్యుతాపురం:
220 కెవి బ్రాండిక్స్ సబ్ స్టేషన్ లో 100 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ -2కి సంబంధించిన సీఅండ్ఆర్ పాతపానల్స్ స్థానంలో కొత్త పానల్స్ అమర్చే పనులు ఆగస్టు18 ఉదయం 8 గంటల నుంచి 20 వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు జరుగుతాయని ఈ మరమ్మతులు కారణంగా 220 కెవి బ్రాండిక్స్ సబ్
స్టేషన్ లో ఓవర్ లోడ్ అయిన పక్షంలో 132 కెవి మరియు 33 కెవి ఫీడర్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చుని సబ్ స్టేషన్ ఓవర్ లోడ్ అయినచో ఆ లోడుని క్రమబద్ధీకరించడానికి 33 కెవి ఇండస్ట్రియల్ డెడికేటెడ్ ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలుపు వేయబడుతుందని అనకాపల్లి కార్యనిర్వాహక ఇంజనీర్
మరియు ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.