జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )-
గొర్రె గర్భంలో చనిపోయిన పిల్లను బయటకు తీసి,ఒక రైతుకు చెందిన గొర్రె ప్రాణాలను కోదాడ పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య గొర్రె ప్రాణాలను కాపాడారు. మునగాల మండలం నరసింహపురం గ్రామానికి చెందిన రైతు బొమ్మ ఎలమంచయ్యకు చెందిన గొర్రె మేత మేయకుండా అస్వస్థతతో ఉండటంతో, శనివారం కోదాడ పశు వైద్యశాలకు తీసుకురాగా డాక్టర్ పెంటయ్య శస్త్రచికిత్స చేసి గొర్రె ప్రాణాలను రక్షించారు.