జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
డిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన 36 గంటల ధర్నా కార్యక్రమానికి పాపిరెడ్డి నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నుండి పెద్ద సంఖ్యలో డిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వారిలో తొంబై శాతం పెదవారే ఉన్నారని,వారి కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ డబ్ల్యూ ఎస్ కమిషన్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో చర్ల రామకృష్ణా రెడ్డి,ఏసిరెడ్డి భూపాల్ రెడ్డి,గడ్డం రాజేశ్వర్ రెడ్డి,దొడ్ల రామిరెడ్డి,గంగుల రాజి రెడ్డి,కార్ల తిరుపతి రెడ్డి, ఈరెడ్డి దేవేందర్ రెడ్డి,తడికల రాజి రెడ్డి,డాకురి అక్కిరెడ్డి,ఏసిరెడ్డి శేఖర్ రెడ్డి,బేతెల్లి ఎల్లా రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి,రామిరెడ్డి,కమలాకర్ రెడ్డి,యాకుబ్ రెడ్డి పాల్గొన్నారు.