జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపి ణీ గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని భరతమాతగా ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం దేశ శాంతిభద్రతల రక్షణ కొరకు ఆలయ అర్చకులు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయం వద్ద ఉదయం 8గంటలకు అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రాష్ట్ర బిజెపి కోశాధికారి. గ్రంధి నానాజీ,సుంకరబుజ్జి, తాతపూడి గోపి, సంసాని పాండురంగారావు, దొమ్మేటి ఫణీంద్ర,సుంకర పవిత్ర గ్రంధి శ్రీను ఆణివిళ్ల వాసు, ఎల్లమిల్లి రమేష్,కొత్తగుండు భాస్కరరావు,గ్రంధిసత్తిబాబు,రామకృష్ణపరమహంస, తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు. విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు మరియు చాక్లెట్లు ఇవ్వడం జరిగింది.భరతమాతగా జెండా అలంకరణలో మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు