ఎస్ఐ దుర్గారెడ్డి,
జనం న్యూస్,ఆగస్ట్ 18, కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామల రహదారులు విధ్వంసం, ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉపొగుతున్న సందర్బంగా సోమవారం సిఐ వెంకట్ రెడ్డి, ఆదేశాలతోఎస్ఐ దుర్గారెడ్డి,తమ సిబ్బందితో సందర్శించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాసోల్ తడ్కల్,డోంగ్ బాన్సువాడ తడ్కల్,జంమ్గి బి తడ్కల్,గ్రామాల మధ్య ప్రవహించే వాగుల నీటి ప్రవాహాని చూసి అయ్యా గ్రామాల ప్రజలకు రాక పోకలకై దారులను పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగిందని అన్నారు. రాత్రి కురిసిన వర్షాల వల్ల పలు గ్రామాల రహదారులు కొట్టుకోపోవడం జరిగిందని అన్నారు. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడం జరిగిందని అన్నారు.మండల పరిధిలోని ప్రజలు నీటి ప్రవాహాల వద్ద ప్రవాహంలో నుంచి దాటే ప్రయత్నం చేయకూడదని అన్నారు.భారీ వర్షం కురవడంతో ఆయా గ్రామాలలో నివాస గృహాలు కూలిపోవడం జరిగిందని అన్నారు. మండల ప్రజలు తమ నివాస గృహాలు శిథిలావస్థలో ఉన్న గృహాలలో నివాసం చేస్తే వర్షాలకు గృహాలు కూలి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.ప్రాణా నష్టం ఆస్తి నష్టం,జరగక ముందుగానే సురక్షిత స్థలాలకు వెళ్లాలని అన్నారు.తడ్కల్ పరిసర ప్రాంతాల రైతుల పంట పొలాలు నీట మునగడం జరిగిందని అన్నారు. వ్యవసాయదారులు నీళ్లు నిలువ ఉన్న లోతట్టు ప్రాంతాలలో వెళ్లకూడదని అన్నారు.