బిచ్కుంద ఆగస్టు 18 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ గ్రామంలో మంజీరా నది తీరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ కౌలాస్ నాలా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తడం జరిగింది మాంజీరా నది నిండుగా ప్రవహించడంతో అందులో చిక్కుకున్న వ్యక్తులను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ ఎస్సై మోహన్ రెడ్డి నిజాంబాద్ రిస్క్ టీం సిబ్బంది కలిసి నలుగురు వ్యక్తులను కాపాడారు దీంతో వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు అధికారులు పట్ల హర్షం వ్యక్తం చేశారు