జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా యాత్రను అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో భాజపా అమలాపురం రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ అధ్యక్షతన, భాజపా అమలాపురం రూరల్ సీనియర్ నాయకులు జంపన బుచ్చి రాజు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, తామ్ర పత్ర గ్రహీత, సహకార వేత్త నడింపల్లి జగ్గరాజు, నడింపల్లి బంగార్రాజు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి, హర్ హర్ గర్ తిరంగా యాత్రను వన్నె చింతలపూడి గ్రామం నుండి ప్రారంభించి ఈదరపల్లి గ్రామం వరకు యాత్రను నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ జిల్లా ఇళ్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రేకాడి సత్యనారాయణ వర్మ, భాజపా మండల కార్యదర్శి పేరూరు వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి తటవర్తి వెంకట సుబ్బారావు, సోరపల్లి పద్మనీకుమార్, మండల సీనియర్ నాయకులు ఈరి కోటేశ్వరరావు, భూపతి రాజు రామరాజు, నడింపల్లి సుబ్బరాజు, జంపన రామ రాజు, దంతులూరి రామ చంద్ర రాజు, జంపన రామ కృష్ణం రాజు, నడింపల్లి సోమ రాజు, నడింపల్లి సుబ్రహ్మాణ్యంరాజు, ఇళ్ళ శ్రీకాంత్, మరియు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు..