జనం న్యూస్ - ఆగస్టు:18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ -
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 6వవార్డు, నందికొండ కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం, వనభోజనాల పండుగను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి కోడిపుంజులు యాటపోతులతో డప్పు వాయిద్యాలతో, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని అందరూ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్య సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ ఆదాసు నాగరాణి విక్రమ్, చిన్న గురవయ్య, ముసలయ్య, కనకయ్య, ప్రసాదు, నరేష్, నాగార్జున, నాగరాజు, ఏడుకొండలు,ముత్తయ్య,యాకోబుసైదులు, విష్ణు, మురళి, మహిళలు పాల్గొని పండగ ను ఘనంగా నిర్వహించారు.