పయనించే సూర్యుడు ఆగస్టు 19 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అమర్ మాట్లాడుతూ ఈనెల 19 తేదీ నుంచి 30 వరకు వివిధ సచివాలయాలలో క్యాంపులు జరుగుతాయి. ఆగస్టు 19 నుంచి 21 వరకు తూర్పుపల్లి, ఏటూరు సచివాలయాల్లో, 22 నుంచి 23 వరకు పాడేరు, ఆదురుపల్లి సచివాలయాలలో, 28 నుంచి 29 వరకు పాతపాడు, వావిలేరు సచివాలయాలలో నిర్వహించనున్నారు. 0–6 సంవత్సరాల పిల్లలకు నూతన ఆధార్ కార్డులు, బయోమెట్రిక్ అప్డేట్ సదుపాయం ఉంటుందని తెలిపారు. మండల వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.