
జనం న్యూస్ ఆగస్టు 19చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో
శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు
భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన నేపథ్యంలో. సోమవారం
_అడిషనల్ కలెక్టర్ నాగేష్ చిట్కుల్ చాముండేశ్వరి బ్రిడ్జ్, భద్రియా తాండ లో పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ.. వరద ప్రవాహ తాకిడి ఎక్కువ ఉందని భద్రత కట్టుదిట్టం చేయాలని అన్నారు. భద్రి తాండ కట్ట డ్యామేజ్ ను మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. చెరువులు, గండ్లు ఉంటే ఇరిగేషన్ శాఖ అధికారులకు, గ్రామాలలో వర్షానికి ఇల్లు కూలిపోయిన పాక్షికంగా దెబ్బతిన్న వెంటనే పంచాయతీ సెక్రెటరీలు తాసిల్దార్ కు రిపోర్టు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ సహదేవ్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం ఆర్ ఐ సునీల్ చౌహన్ ఎంపీడీవో ప్రశాంత్, నిత్యానందం, ఏపీవో శ్యామ్, ఇన్చార్జ్ ఎంపీఓ తిరుపతి స్థానిక ఎస్సై నర్సింలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు