
జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం సా.6 గంటలకు మూడు లాంతర్ల నుంచి గంటస్తంభం వరకు "ఓట్ చోర్ గద్ది చోడ్" కొవ్వొత్తుల ర్యాలీనీ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ… నిన్నటి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ చూస్తే సీఈసీ జ్ఞానేశ్వర్ ద్వంద నీతి, రెండు నాలుకల ధోరణికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈసీ తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదన్నారు.