
జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో
వినాయక చవితి – మండప నిర్వాహకులకు సూచనలు
చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి మండప నిర్వాహకులు క్రింది సూచనలను కచ్చితంగా పాటించవలసి ఉంటుంది: మండపం ఏర్పాటుకు ముందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పత్రం పొందాలి ఆన్లైన్ లింక్ ద్వారా అప్లై చేసిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కు దరఖాస్తు కాపీ సమర్పించాలి.మండపాలను రహదారులు, అంబులెన్స్ మార్గాలు, అగ్నిమాపక వాహనాల మార్గాలకు అడ్డంకులు కలగకుండా ఏర్పాటు చేయాలి. విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా అమర్చాలి. షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ప్పనిసరిగా ఉంచాలి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు వాడరాదు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. లౌడ్స్పీకర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. అధిక శబ్దం, డీజే మ్యూజిక్ వాడరాదు. ఊరేగింపుల కోసం ముందస్తు అనుమతి తీసుకుని, పోలీసుల సూచించిన మార్గంలోనే జరపాలి. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాలంటీర్లను నియమించాలి.జాతి, మత, కుల భావోద్వేగాలను దెబ్బతీయగల నినాదాలు, పాటలు, ప్రసంగాలు చేయరాదు. సఖ్యత, సౌహార్ద్ర వాతావరణం కొనసాగించాలి. మండప పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పండుగ అనంతరం చెత్తను సక్రమంగా తొలగించాలి. ప్రతి మండపంలో పగలు మరియు రాత్రి సమయాల్లో కనీసం ఇద్దరు వాలంటీర్లు విధులు నిర్వర్తించాలి. వారు భద్రత, ట్రాఫిక్, పరిశుభ్రత విషయాలను పర్యవేక్షించాలి పలు సూచనలు చేయడం జరిగింది