
జనం న్యూస్;19 ఆగస్టు మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్
సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించేందుకు సాహిత్యం ఉపయోగపడుతుందని కూడవెళ్ళి రామలింగేశ్వర దేవస్థాన అర్చకులు సాంకేత్ శర్మ అన్నారు. సోమవారం ఉదయం ఉండ్రాళ్ళ రాజేశం రచించిన కృష్ణ చరితం, నల్ల అశోక్ రచించిన సుకృతి శతక పుస్తకాలు అందుకుని, ఛందోబద్ధమైన పద్యాలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, నల్ల అశోక్, శ్రీనివాస్ రెడ్డి, చెరుకు మహేందర్, బైరి రమేష్ తదితరులు పాల్గొన్నారు