
జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
మూసాపేట వెంకటేశ్వర నగర్ లోని శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించి పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పెద్ద బుద్ధి దామోదరయ్య, లోకేష్ సాగర్, మన్నెం సాగర్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, తూము వేణు, తూము సంతోష్, మేకల రమేష్, గోవిందు, నాగరాజు, భాస్కర్, సోను, మేఘనాథ్, శ్రావణ్, వాసు, పర్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
