
జనం న్యూస్ ఆగష్టు 20 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
జిల్లాలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నా,యూరియా కొరతతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు పోనుగోటి రంగా విమర్శించారు.మంగళవారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ఆసొసైటీల్లో ఒక బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, డీలర్లు యూరియా పై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు సొసైటీల్లో రైతులకు సరిపడా యూరియాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.