జనం న్యూస్ జనవరి 28 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని పవిత్రమైన పురాతన శ్రీ బాలాజి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ప్రతీ సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే వార్షిక జాతర వచ్చే నెల ఫిబ్రవరి 11,12,13 తేదీలలో నిర్వహించటం జరగుతుంది.కుమురం భీం జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన జాతరలలో గంగాపూర్ ఒకటి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి వెంకటేష్ దొత్రే,డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,జిల్లా ఎస్పీ డి .వి శ్రీనివాస్ రావు చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గుడి చైర్మెన్ జయరాం,మండల అధ్యక్షులు లావుడ్యా రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం దేవాజీ, కాంగ్రెస్ సీనియర్ నేత,గౌడ సంఘము జిల్లా అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్,బాలేష్ గౌడ్,సీనియర్ నాయకులు గంటుమేరా,రెబ్బెన టౌన్అధ్యక్షులు వనమల మురళి,నాయకులు దుర్గం రాజేష్, దుర్గం అన్నాజీ,గోగార్ల రాజేష్, గుంపుల విమలేష్ రామచందర్,ఇ రవి,ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు