
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ సంచార జాతుల దినోత్సవం గా జరగనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగా ఈనెల 30వ తేదీ స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా సంచార జాతుల సదస్సును రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారధ్యంలో నిర్వహిస్తున్నారు కావున పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతుల సోదరులందరూ భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా కోరారు సంచార జాతుల వారు స్వాతంత్ర సమయంలో అనేక రకాలుగా బానిసత్వం పై బ్రిటిష్ వారిపై పోరాడారని మనకు స్వతంత్రం వచ్చే విషయంలో వీరి పాత్ర గణనీయమైనదని మీరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంచరిస్తూ స్వతంత్ర పోరాట సమయంలో ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి స్వతంత్ర పోరాటం గురించి వివరిస్తూ విశేష సేవలు చేశారని అలాంటి సంచార జాతుల వారు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారని కనీసం వారికి విద్య గృహ సదుపాయాలు రేషన్ కార్డులు కూడా కరువయ్యావని కనీస గుర్తింపు కూడా లేదని గ్రహించిన నరేంద్ర మోడీ సంచార జాతులకు ఒక బోర్డు ఏర్పాటు చేసి దానికి 200 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారని తెలియజేశారు అట్టడుగున ఉన్న సంచార జాతుల వారిని వారి సమస్యలను తెలుసుకుని గుర్తించి వారిని జనజీవన స్రవంతిలో వారికి కూడా తగన గుర్తింపు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఈనెల 30వ తేదీ బహిరంగ సదస్సును విజయవాడ నందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సంచార జాతుల కుల పెద్దలను కలిసి వారి సదస్సుకు ఆహ్వానించి సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ పట్టణ ఓ బి సి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు ఓబీసీ నాయకులు గుమ్మా బాలకృష్ణ ఊటికొండ నాగేశ్వరరావు జోలాపురం వెంకటరాయుడు ముద్దపాటి సుబ్బారావు మరియు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు