
జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఫోటోగ్రాఫర్లు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు మాట్లాడుతూ మధురనుభూతులకి గుర్తుగా ఫోటోగ్రఫీ నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు శంకర్రావు, నరసింహ, నరేందర్, వెంకటేశ్వరరావు, కనకరాజు, శంకర్, శివ నాగులు, అప్పారావు, స్వతంత్ర, సురేష్, శీను, కోదండమ్, తాతీలు, రాజు, ప్రసాద్, వెంకటేష్, ధనరాజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.