
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం పాల్గొన్న రాష్ట్ర నేతలు దేవానంద్, రమేష్ నాయుడు, జయప్రకాష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం అమలాపురం సత్యనారాయణ విలాస్ లో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి జయ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ ర్యాలీ సంబంధించిన పూర్తి కార్యాచరణను మరియు చేయవలసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా జిల్లా పెద్దలు, నాయకులకు, మండల అధ్యక్షులకు ఇన్చార్జిలకు ప్రధాన కార్యదర్శులకు మరియు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అడబాల మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన ఉదయం రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అమలాపురం నుంచి శోభా యాత్ర ప్రారంభమై గడియార స్తంభం మీదుగా ర్యాలీ కొనసాగుతుంది అని, చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దేవానంద్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు గురించి మీరా మాట్లాడేది అన్నారు. పులివెందుల లో ఎప్పుడైనా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా అన్నారు. కూటమి ప్రభుత్వంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు సేచ్చగా జరిగాయి. ఓటర్లు భయం లేకుండా వచ్చి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో కూటమికి ఆదరణ పెరుగుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారధ్యం అనే పేరుతో చేస్తున్న పర్యటనల్లో అద్భుత స్పందన వస్తుందన్నారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అన్నారు . రమేష్ నాయుడు మాట్లాడుతూ సారధ్యం కార్యక్రమం ద్వారా సమాజానికి ఉపయోగపడిన వారిని కాబోయే తరాలకు పరిచయం చేసే విధంగా మాధవ్ చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అమలాపురం లో అద్భుతమైన స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాశ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ బాధ్యతలు స్వీకరించాక అన్ని జిల్లాలలో క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తున్నారు. 25 వ తేదీన అమలాపురం లో పర్యటన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలిగే లాభాలు ప్రజలకు అర్థం అయిందని, గత జగన్ నాయకత్వం లో అరాచక పాలన జరిగింది అని, అనంతరం ప్రజలు విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. అమరావతి మునిగి పోతుందని అసత్యం ప్రచారం చేశారు. వాస్తవంగా అమరావతి లో ఎక్కడ మునిగిపోయే పరిస్తితి లేదు. ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం గా ఉన్నాయి. కానీ వైసీపీ నేతలు పెట్టుబడి పెట్టేవారిని యపెడుతున్నారన్నారు. ఇక్కడ పెట్టుబడి పెడితే నష్టపోతారు అని వారికి చెబుతున్నారని అన్నారు. ప్రజలు వైసీపీ ని తరిమికొట్టే పరిస్థితి ఏర్పడింది. జగన్ జాతీయ జెండా ను కూడా ఎగర వేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ సొంత మీడియా చానళ్లు ద్వారా అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, జిల్లా ఇన్చార్జి పొట్లూరి రామ్మోహన్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, పూర్వపు అధ్యక్షులు యాళ్ల దొరబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, అనకాపల్లి ఇంచార్జి కర్రి చిట్టిబాబు, గుంటూరు జిల్లా ఇంచార్జీ తమనంపూడి రామకృష్ణారెడ్డి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ తదితరులు పాల్గొన్నారు.