జనం న్యూస్ జనవరి 27 టీ. సుండుపల్లి మండలం,అన్నమయ్య జిల్లా;(రిపోర్టర్:జి. ప్రవీణ్ కుమార్): టీ.సుండుపల్లి మార్కెట్ నందు, ప్రకృతి వ్యవసాయసిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన కూరగాయలను, ఆకుకూరలను స్టాల్ పెట్టి, ప్రజలకు ప్రకృతి వ్యవసాయం గురించి పి.ఆంజనేయులు సి ఆర్ పి, వివరిస్తూ నేడు రసాయన పురుగు మందులు వాడి, భూమాత నిస్సారం అవడమే గాక, ఈ ఆహరం తిన్న ప్రజలు కూడా అనేక రోగాలు బారిన పడితున్నారని రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయ విధానంలో కాషాయాలు,ద్రవణాలు వాడాలని, నిస్సారమైన భూమిని, మన ఆరోగ్యాని కాపాడు కోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో యం.రామమోహన్ ఎల్ వన్, యం. రామాంజనేయులు మోడల్ మేకర్, ఎస్. వెంకటయ్య ఎల్ టు, బి.రాజు నాయక్ ఎల్ టు,ఐ సి ఆర్ పి లు.టీ. రామాంజనేయులు, సుమలత, కొండమ్మ, బి.ఆంజనేయులు రైతులు పాల్గొన్నారు.