
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఈ నెల 27.08.2025 వ తేదీ న వినాయక చవితి పండుగ సదర్భంగా తమ గ్రామాల యందు వినాయక విగ్రహాలను పెట్టు కోవాలనుకున్న ఆయా గ్రామాల ప్రజలు,ఉత్సవ కమిటీ సభ్యులు తమ ఆదార్ కార్డు లతో నందలూరు పోలీసు స్టేషన్ కు వచ్చి అప్లికేషన్ తీసుకొని తగిన సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకోవాలని నందలూరు ఎస్.ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.