పాల్వంచ పట్టణ రెవెన్యూ పరిధిలో గల శ్రీనివాస నగర్ కాలనీ మొరేడు వాగు ఒడ్డున గల శ్రీమతి చిటకన కనకమ్మ పేరున పన్నులు వగైరా చెల్లిస్తున్న సర్వే నెంబరు 817లో విస్తీర్ణం భూమి రెండు ఎకరాల 26 కుంటలు అసైన్మెంట్ పట్టా భూమిని సేద్యం చేస్తున్నది, చిటికెన కనకమ్మ ముసలయ్య దంపతుల కుమార్తె వివాహం అవసరాల నిమిత్తం 2005 సంవత్సరంలో సదరభూమిని కోటిపల్లి సాయిబాబు వద్ద పూచిక పెట్టి మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకోగా అట్టి భూమిని సదరు సాయిబాబు తన అప్పుకు వడ్డీ కింద పంట పల సాయం పొందే శరత్, కానీ సాయిబాబు పంటపల సహాయం పొందుతూ ఈ భూమిని కనకమ్మ ముసలయ్య కి తెలియకుండా ఆ ప్రక్కనే ఉన్న సముద్రాల సైదులు రామకృష్ణ సేద్యము భూమి పక్కన తన భార్య కనకమ్మ ముసలయ్య ప్రమేయము లేకుండా వారి సంతకాలు ఫోర్జరీ చేసి సముద్రాల సాయిబాబా రామకృష్ణ గార్లకు సాయిబాబు విక్రయించినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించుకుని ముసలయ్య కనకమ్మలను మోసం చేయడం జరిగింది, కనకమ్మ ముసలయ్య దంపతులు భూమి వద్దకు వెళితే సైదులు రామకృష్ణులురావద్దని బెదిరిస్తున్న నేపథ్యంలో సదరుకనకమ్మముసలయ్య ని ఇట్టి భూమి పూ చికత్దూ నుండి విముక్తి చేయడానికి ముసలయ్య కనకమ్మగారులు ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన సదరు సాయిబాబు ఇదిగో అదుగో అంటూ దాటవేస్తూ కాలం గడిపాడు అంతేకాకుండా సముద్రాల సైదులు రామకృష్ణలు తోపాటు సాయిబాబు ఈ ముగ్గురు ఏకమై ముసలయ్య ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలోసదరు ముసలయ్య కోర్టును ఆశ్రయించగా కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిమెంట్ నుండి ముసలయ్య కనకమ్మ గార్లకు అనుకూలంగా తీర్పు 30 11 2018 న వచ్చింది అప్పటినుండి సదరు భూమిని ముసలయ్య కుటుంబం సేద్యం చేస్తూ అనుభవిస్తున్న క్రమంలో 27 జనవరి 2025 రోజున వారి పొలంలోని సీసీ కెమెరాలను గుర్తు తెలియని వ్యక్తులు కాగడాలని ముఖానికి అడ్డంగా పెట్టుకుని కాకడాలతో కాల్చివేసి నారు, ఈ సంగతి తెలిసిన ముసలయ్య తన భూమి వద్దకు వెళ్లగా ట్రాక్టర్ల తో సదరు రామకృష్ణ సైదులు పంట పొలాలను ధ్వంసం చేస్తుండగా ముసలయ్య అడ్డుకోగా వారిని నెట్టివేసి క్రింద పడవేసి సముద్రాల రామకృష్ణ ముసలయ్య ని కాలితో తన్నుతూ బలంగా కడుపులో గుద్దడం జరిగినది. అతన్ని కాపాడటానికి అడ్డువచ్చిన కందుకూరి రామును కూడా సముద్రాల సైదులు తలపై కర్రతో మొధినాడు తలకు బలమైన గాయం అయినది, ఈ దుశ్చర్యను వీడియోగా తీస్తున్న వీరి అబ్బాయి ని వీపుపై సైదులు సాయిబాబు రామకృష్ణ ఈ ముగ్గురు కూడా విచక్షణ రహితంగా కర్రతో కొట్టడంతో వారు కూడా ప్రాణాపాయంతో పారిపోయారు ఈ విషయం పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు నిమ్మకు నీరతినట్లుగా ఉన్నట్లుగా తెలిసినది. రామకృష్ణ సైదులు సాయిబాబు వెనుక బలమైన రాజకీయ శక్తి ఉంటుందని ప్రజలు అంటున్నారు, రామకృష్ణ సైదులు యదేచంగా తిరుగుతూ ఉన్నారు, ఇట్టి భూమిని దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నించిన సదురు రామకృష్ణ సైదులు పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తూముల శ్రీనివాస్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కురిమిళ్ళ శంకర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు బీసీ సంక్షేమం జిల్లా నాయకులు జక్కుల పాల్గొన ముదిగొండ రాంబాబు కంచర్ల శ్రీనివాస్ నిమ్మల రాంబాబు సాలికోల శివకుమారి రోజా రాణి పావురాల రామ తులసి సక్కుబాయి సుధాకర్ తదితరులు ఈ దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు