
జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి మంగళవారం తెలిపారు. ఒడిశాలోని మునుగడకు చెందిన రాందాస్ గంట, అంతరామి మల్లిక్‌ను విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా 10 కేజీల గంజాయితో పట్టుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అనంతరం గంజాయి సీజ్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.