
జుక్కల్ ఆగస్టు 20 జనం న్యూస్
నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని.. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా మార్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ గారు అని, యువత రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ఆయన చారిత్రాత్మక నిర్ణయమని, నేడు భారత్ ఏఐ, టెక్నాలజీ రంగాల్లో ముందుకు దూసుకుపోతుందంటే దానికి బలమైన పునాది వేసింది రాజీవ్ గాంధీ గారి విజన్ అని, దేశం కోసం, ప్రజల కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని.. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు..
ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందున్న కర్తవ్యం అని చెప్పారు.. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు, యువత సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు.. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మండల్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్. మద్దూర్ మండల్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్. కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్. మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, శివాజీ పటేల్, గంగు నాయక్. మాజీ ఎంపీటీసీ రామచంద్ర పటేల్, జుక్కల్ మండల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

