
జనం న్యూస్ ఆగస్టు 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కీర్తిశేషులు కొణతాల వెంకట నూకరాజు ( గోపాల్) జగన్నాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈరోజు వారి స్వగృహంలో పెదకర్మ కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు వారి స్వగృహం కి వెళ్లి గోపాల్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అందరినీ పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నాగ జగదీష్ అన్నారు. అలాగే జగన్నాథ స్వామి కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా పాల్గొని కొణతాల వెంకట నూకరాజు ( గోపాల్) చిత్రపటానికి అక్షింతలు పుష్పాలు సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. సత్తన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కొణతాల వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ కుప్పిలి జగన్ మల్ల గణేష్ విల్లూరి రమణబాబు గోపాల్ సోదరుడు అప్పలనాయుడు గోవిందా తదితరులు పాల్గొన్నారు.