
జనం న్యూస్ ఆగస్ట్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి పట్టణం స్థానిక నూకాలమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో మురుగనీరు రోడ్లపై ప్రవహించి వాహనదారులకు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యేది. స్థానికులు కూటమి నాయకులకు తెలియజేయగా అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ బీమర్శెట్టి రామ్కి కి, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కి తెలియజేయగా, వారు స్థానిక నాయకులతో పరిశీలించి శాసనసభ్యులు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కి తెలియజేయగా వారు వెంటనే అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీలు రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో కూటమి నాయకులు డ్రైనేజ్ నిర్మాణ , రోడ్డుపనులు ప్రారంభించారు. స్థానిక ప్రజలు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కి , జనసేన పార్టీ ఇంచార్జ్ భీమశెట్టి రామ్కి కి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇది పీలా గోవింద సత్యనారాయణ కి ధన్యవాదాలు తెలియజేశారు.