
రాష్ట్రానికి కావలసిన యూరియా సరఫరా చేయకుండా, మోదీ నేతృత్వంలోని కేంద్రం నిర్లక్ష్యం, వివక్షత చూపుతోంది
జనం న్యూస్, ఆగస్టు 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా, పాములపర్తి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులను ఇబ్బందులు పెడుతూ రైతుల పట్ల వివక్ష చూపుతూ తమ రాజకీయాల స్వార్థం కోసం అటు బిజెపి, ఇటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు. పైశాచిక ఆనందం పొందుతున్నారు తెలంగాణ రైతాంగానికి కావలసి నటువంటి 8 లక్షల 30.000 టన్నుల యూరియా రావలసి ఉంటే 5 లక్షల 32 వేల టన్నుల యూరియాను పంపించేసింది కేంద్ర ప్రభుత్వం, ఈ విధంగా అరకోర యూరియాని పంపించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని మండిపడ్డారు