
జనం న్యూస్, ఆగస్ట్ 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా జమ్మికుంట మండల కాంగ్రెస్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేశిని కోటి,సుంకరి రమేష్,పొన్నగంటి మల్లయ్య మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక రంగంలో మన దేశానికి విదేశీ పెట్టుబడులు లాంటి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి, దేశ అభివృద్ధి దేశ పురోగతిని చక్కదిద్దారన్నారు. 21 సంవత్సరం ఉండబడిన ఓటు హక్కును 18 సంవత్సరాలకే కుదించారన్నారు.భారతదేశం కోసం అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారని,చివరికి దేశం కోసమే ప్రాణాలర్పించారని మాట్లాడారు. అలాంటి గొప్ప కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం వాళ్ల తల్లి,ఇందిరా గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. 2004&2009లో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి అవకాశం వచ్చిన,పదవులు ముఖ్యం కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలని ఒక ఆర్థికవేత అయినా మన్మోహన్ సింగ్ ని రెండుసార్లు ప్రధానమంత్రిని దేశా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారని, ఇలాంటి కుటుంబం కోసం వారి ఆశయాలను వారి ఆశ సాధనల కోసం మనందరం కలిసికట్టుగా కాంగ్రెస్ యువ నాయకులు సైనికులుగా పనిచేసి రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన, ఎలగందుల స్వరూప శ్రీహరి,శ్రీపతి నరేష్,. దిడ్డి రాము,మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు, సూర్య,.కాంగ్రెస్ నాయకులు పార్లపల్లి నాగరాజ్ ముద్దమల్ల రవి. పంజాల అనిల్ . ఎండి సలీం పాషా. పిడుగు భాగ్యలక్ష్మి . కుదాడితిరుపతి. మర్రి రామ్ రెడ్డి అశోక్ భాస్కర్ .ప్రవీణ్ .తిరుపతి. శ్రీనివాస్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
