
జనం న్యూస్, ఆగస్ట్ 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్)
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూరాబాద్ నకు కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పరిశీలన నిమిత్తం వచ్చి, కళాశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మైనర్ రిపేర్ వర్క్ లకు చెందిన పనులను పరిశీలించడం జరిగింది. కళాశాల విద్యార్థులకు సమావేశ మందిరము మరియు ఇతరత్రా పనులు గ్రిల్స్, మెట్లు, ఫ్యాన్లు, కరెంటు,విద్యార్థులకు మీటింగ్ హాల్ లేనందున, ఆడిటోరియం ఆవశ్యకత సంబందించిన వివరాలు కళాశాల ప్రిన్షిపాల్ తెలియజేసారు. అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఐడి కార్డ్స్ ఉచితంగా పంపిణీ చేసారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి పాఠాలు నేర్చుకొని ఉత్తీర్ణాత శాతం పెంచాలని సూచించారు. కళాశాల ఆవరణలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలను, చెత్తా చెదారము లను తొలగించి సుమారు 250 మొక్కలు నాటారు. అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ని శాలువాతో కళాశాల ప్రిన్సిపాల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు, లెక్చరర్లు కే సుగుణ, ప్రసాద్, జీ తులసీదాస్, కె.వి వాసుదేవరావు, కే మురళీమోహన్, జై విజేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సుహాసిని, లైబ్రేరియన్ రాజేశం, వెంకటరమణ, రాజేందర్, రహీముద్దీన్ పాల్గొన్నారు
