
జనం న్యూస్, ఆగస్ట్ 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )
ధర్మారం గ్రామానికి చెందిన శ్రీధర్ రావు అనే అతని ఫోను వచ్చే మార్గంలో ఎక్కడో పడిపోయింది, ఆగి చూసుకునేసరికి ఫోను లేదు, వెంటనే జమ్మికుంట స్థానిక పోలీస్ స్టేషన్లో,పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ కి సంప్రదించగా అతని యొక్క పోన్ (ఐఏంఇఏ నెంబర్ ) (సి ఇ ఐ అర్ పోర్టల్, )ద్వారా వారి యొక్క మొబైల్ ని పట్టుకొని బాధితుడు శ్రీధర్ రావు కి అందించారు. ఇ సందర్బంగా బాధితులు శ్రీధర్ రావు సిఐ రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ..ఎవరైనా తన మొబైల్ ఫోన్ లను పోగొట్టుకున్నప్పుడు వెంటనే సి ఇ ఐ అర్) పోర్టల్ లో అప్లోడ్ చేపించుకోవాలని, తద్వారా సెల్ ఫోన్లు సులువుగా గుర్తించే అవకాశం ఉన్నాయని, జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ సూచించారు.