
ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ పెద్ది కుమార్..
జనం న్యూస్, ఆగస్ట్ 20, కుమార్ యాదవ్
ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఆధునికత ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని అన్నారు. సైన్స్ ని., టెలీకాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారన్నారు.శాంతి, ప్రజాస్వామ్య విలువలకు తన జీవితాన్ని అంకితం చేశారని,ఈ దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, యువతకు అవకాశాలు కల్పించి దేశ ప్రగతికి పాటుపడాలని సంకల్పించారన్నారు. ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీ పంజాబ్ ఒప్పందం, ఇండియా మరియు శ్రీలంక ఒప్పందం వంటి శాంతి నిర్ణయాలతో ప్రపంచ మన్ననలు పొందారు అని మాట్లాడారు.ఈ కార్యక్రమలో-ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, కనుమల్ల సంపత్,వంగ రామకృష్ణ,గొడిశాల పరమేశ్వర్, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి,గంగారం మహేష్,పెద్ది శివకుమార్,గొడుగు మానస,మీసా రాజయ్య, భోగం సాయిరాం, తోడేటి కిషన్,బండి మల్లయ్య, మర్రి వీరారెడ్డి,గోరుకుంట్ల స్వామి, బైరెడ్డి కొండారెడ్డి, గడ్డి శ్రీనివాస్, మోతే మహేందర్,మంకు ఐలయ్య,గొట్టే రాజశేఖర్, తాడెం దిలీప్,దంసాని తిరుపతి,రావుల రాజబాబు, దార నరేష్, రేణిగుంట రవీందర్, రావుల మోహన్ రెడ్డి,ఉప్పుల మల్లారెడ్డి,ఉప్పుల శ్రీనివాసరెడ్డి,శాతాల మధు,మారేపల్లి వంశీ,జక్కు కుమారస్వామి,ఆకనపల్లి వెంకటేష్,గుండార కిరణ్,పైడిపల్లి దేవేందర్,ఎండి అజ్గర్ పాషా, దాసరి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.